శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో విజయదుర్గ

UPDATED 29th SEPTEMBER 2017 FRIDAY 9:30 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ నవమి శుక్రవారం తొమ్మిదవరోజు మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయదుర్గా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులనుద్దేశించి పీఠాధిపతి గాడ్ ప్రసంగిస్తూ అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మాహోగ్రరూపంగా భావిస్తారని, అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహార్నవమిగా జరుపుకుంటామన్నారు. సింహవాహనంపై అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుందని, ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందన్నారు. మహిషాసురమర్దిని ఆరాధనవల్ల భయాలన్నీ తొలగి, సర్వకార్యాలలో విజయం సిద్దిస్తుందన్నారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త  కేశాప్రగడ సత్యనారాయణ దేవీ భాగవతం, రాజమహేంద్రవరంకి చెందిన శైలజాపాత్రో బృందం భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా కన్వీనర్ తుమ్మిడి రామ్ కుమార్, జి ఎస్ ఎల్ హాస్పిటల్స్  డైరెక్టర్ డాక్టర్ గన్ని భాస్కరరావు, హిందూ ధర్మ రక్షణ సమితి రీజినల్ కోఆర్డినేటర్ కందర్ప హనుమాన్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని, అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల మాధవాచార్యులు, చీమలకొండ వీరావధాని, తోలేటి నాగేంద్ర శర్మ, చీమలకొండ శ్రీనివాస్, పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి. బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి) తదితరులు పాల్గొన్నారు.                   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us