దివిలి కిట్స్ లో ‘బ్రోచేవారెవరురా’ సందడి

UPDATED 4th JULY 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండల పరిధిలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం బ్రోచేవారెవరురా చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా హీరో శ్రీవిష్ణు, హీరోయిన్‌ నివేదా థామస్‌, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, తదితరులు కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో చక్కగా రూపొందించామని, అందరు మెచ్చేలా సినిమా ఉంటుందని చెప్పారు. హీరోయిన్‌ నివేదా థామస్ మాట్లాడుతూ కేవలం మహిళల కోసమే ఈ సినిమా రూపుదిద్దుకుందని, కామెడీతో పాటు థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సినిమాలో డైలాగులు చెప్పి, పాటలు పాడి విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి హుషారెత్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, ఏవో కెఆర్ సందీప్, ఈవో ఎన్. జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, ప్రిన్సిపాల్ ఈ. సర్వరామేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us