మెషిన్ లెర్నింగ్ పై ఎఫ్.డి.పి ప్రారంభం

UPDATED 5th JULY 2019 FRIDAY 5:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల, బెన్నెట్ విశ్వవిద్యాలయం (గ్రేటర్ నోయిడా)తో కలిసి మెషిన్ లెర్నింగ్ పై  ఫాకల్టీ డవలప్ మెంట్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించింది. కళాశాల సిఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బెన్నెట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సునీత్ కుమార్ గుప్తా కీపర్సన్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుల ప్రమేయం లేకుండా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని సమస్యలకు సరైన సమాధానాలు కనుగొనే సామర్ధ్యాన్ని సంతరించుకున్న శాస్త్ర విజ్ఞాన విభాగాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారని పేర్కొన్నారు. నిర్ణయాలకు అవసరమైన పాత సమాచారాన్ని శోధించి విశ్లేషణ చేయడానికి అవసరమైన శక్తిని కలిగి ఉండడం మెషిన్ లెర్నింగ్ ప్రత్యేకత అన్నారు. మెషిన్ లెర్నింగ్ ప్రస్తుతం వ్యాపార, వ్యవసాయ, విద్యా, వైద్య రంగాల్లో ఉపయోగిస్తున్నారని ఆయన  తెలిపారు. రెండు రోజులపాటు జరుగు ఈ వర్క్ షాపును సద్వినియోగం చేసుకోవాలని సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ బి. సుజాత కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us