UPDATED 13th JUNE 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని సామర్లకోట మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రాజన్న బడిబాట రెండో రోజు కార్యక్రమంలో గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు విభిన్న అంశాల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభోధన జరుగుతుందని అన్నారు. ప్రతీ విద్యార్థి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న బడిబాట కార్యక్రమం రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రతీ విద్యార్థీ ఓ మొక్కను నాటి ఆ మొక్కను దత్తత తీసుకుని పెంచే బాధ్యత తీసుకోవాలని ఎంఈవో సూచించారు. అనంతరం విద్యార్థులకు బూట్లు, మేజోళ్ళు ఆయన చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్ళూరి వైకుంఠం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







