రాక్ సిరామిక్స్ లో ఘనంగా పర్యావరణ దినోత్సవం

సామర్లకోట:5 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని స్థానిక రాక్ సిరామిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ కాకినాడ సైంటిఫిక్ ఆఫీసర్ పీవీఎస్ చలం హాజరయ్యారు. అలాగే పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని అన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. ఈకార్యక్రమంలో రాక్ సిరామిక్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ యాదవ్, సీనియర్ జనరల్ మేనేజర్ స్వామినాథన్, టైల్స్ డివిజన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అక్బర్ బాషా, అకౌంట్స్ హెచ్.వో.డీ నటరాజ్, పర్చేస్ హెచ్.వో.డీ వెంకటేశ్వరరావు, సేఫ్టీ హెడ్ శ్రీ బాలాజీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సాహు, పి.ఆర్.వో వీజీఎస్ కుమార్, సి.ఎస్.వో గౌడ ఉద్యోగులు పాల్గొని మొక్కలు నాటారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us