లక్ష్య సాధనలో శక్తివంచన లేకుండా కృషి చేయాలి

UPDATED 21st JUNE 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: ఎంచుకొన్న మార్గంలో లక్ష్యసాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రముఖ రచయిత, దర్శకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ బిబిఎ 2018-19 విద్యా సంవత్సరం మొదటి సంవత్సర తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యండమూరి వీరేంద్రనాథ్ హాజరై మాట్లాడారు. విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోడానికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులతో పాటు తల్లితండ్రుల పాత్రకూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ఉన్నతమైన ఆలోచనలతోనే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోగలమని, మన ఆలోచనా విధానం ఉన్నతంగా ఉండి వాటి సాధనకు నిరంతరం ప్రయత్నించాలని అన్నారు. ఉత్తమ తల్లితండ్రుల వల్ల మాత్రమే ఉత్తమమైన పిల్లలు తయారవుతారని, తల్లితండ్రులు పిల్లల సమక్షంలో పోట్లాడుకోవడం కీచులాడుకోవడం చేయరాదని తల్లితండ్రులకు సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధ్యాపక సిబ్బందికి ముఖ్యఅతిధి చేతుల మీదుగా నగదు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి,  బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఆస్థాశర్మ, డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us