దేశప్రగతి అక్షరాస్యతతోనే సాధ్యం

UPDATED 8th SEPTEMBER 2018 SATURDAY 8:00 PM

సామర్లకోట: దేశ ప్రగతి ఆ దేశం యొక్క అక్షరాస్యతపై ఆధారపడి ఉంటుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్నిశనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యునెస్కో మొదటిసారిగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని 1967వ సంవత్సరంలో నిర్వహించారని, అందరికీ అక్షర జ్ఞానం అందించాలనే సంకల్పంతో సెప్టెంబర్ ఎనిమిదిన ఈ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఇది చిన్నారులకు కాక వయోజనులైన వృద్ధులకు సైతం అందించాలన్నదే దీని ఉద్దేశ్యం అన్నారు. చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం అనే ప్రాధమిక అంశాలే కాకుండా గౌరవం, వినయం, వివేకం, అభివృద్ధి చెందడమే నిజమైన అక్షరాస్యత అని పేర్కొన్నారు.ఉన్నతమైన జీవనానికి విద్య, విజ్ఞానం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుడు తాళ్లూరి వైకుంఠం, భద్రావతి, శివప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us