UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో సిహెచ్ జగ్గారావు విచ్చేసి ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి, పంచాయతీ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







