UPDATED 19th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: మండల పరిధిలోని హుస్సేన్ పురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన మార్ని లోవరాజు, మేడి వీర దుర్గాప్రసాద్ అను వ్యక్తులు సామర్లకోట నుంచి హుస్సేన్ పురం వెళ్తుండగా కెనాల్ రోడ్డులో గల నవభారత్ షుగర్ ఫ్యాక్టరీ దాటిన తరువాత బిక్కవోలు నుంచి సామర్లకోట వస్తున్న బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. మృతదేహాలను 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.







