ఫిజియో థెరపీ సేవలను వినియోగించుకోవాలి

UPDATED 26th NOVEMBER 2019 TUESDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): విభిన్న ప్రతిభావంతులకు ఫిజియోథెరపీ ద్వారా ఎంతో మేలు కలుగుతుందని  ఎంఈవో ఎస్. విజయలక్ష్మీదేవి, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జోసఫ్ అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిత కేంద్రంలో ఉన్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అవగాహనతో మెలగాలని అన్నారు. ప్రభుత్వం భవిత కేంద్రాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ చేయిస్తున్నందున ఫిజియో శిబిరానికి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతీ వారం క్రమం తప్పకుండా తీసుకురావాలని, అవసరమైన సేవలు కేంద్రంలో అందించడం జరుగుతుందని వివరించారు. శిబిరంలో చేయించిన వ్యాయామాలను ఇంటివద్ద కూడా చేయిస్తే తక్కువ వయసులోనే చిన్నారుల్లో మంచి మార్పును చూడవచ్చన్నారు. రోజుకు ఎన్నిసార్లు వ్యాయామాలు చేయించాలి.. ఎలా చేయించాలనేది వివరించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా సాధారణ చిన్నారుల మాదిరిగా అన్ని పనులు చేయగలుగుతారని తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా భవిత కేంద్రంలో అందిస్తున్న అనేకమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భవిత టీచర్స్ అనిత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us