సామర్లకోట మున్సిపల్ కమీషనరుగా ఏసుబాబు

UPDATED 15th JULY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపల్ కమీషనరుగా ఎం. ఏసుబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం  ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని, ప్రజలు, అధికారులు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందించాలని అన్నారు. పట్టణంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తామని, అలాగే పారిశుధ్యం, మంచినీటి సమస్యకు తొలి ప్రాధాన్యత కల్పించి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ అచ్యుతరావు, డిఇ రామారావు, ఎఈ  ప్రభాకర్, రాజశేఖర్ టిపీవో మంజుల, తదితరులు కమీషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us