UPDATED 17th DECEMBER 2020 THURSDAY 7:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలో గురువారం లెక్కించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు. హుండీ లెక్కింపు ద్వారా 113 రోజులకు రూ.4,69,053 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, తనిఖీదారు వి.ఎల్.ఎన్.రెడ్డి, దేవస్థానం వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.







