ప్రజావాణికి పది అర్జీలు

UPDATED 8th OCTOBER 2018 MONDAY 5:30 PM

పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో భూసమస్యకు సంబంధించి రెండు అర్జీలు, రేషన్ షాపుకు సంబంధించి ఒకటి, శ్మశానానికి భూ కేటాయింపు నిమిత్తం ఒకటి, పట్టాదారు పాస్ బుక్ రద్దు చేయమని ఒకటి, ఇంటి పట్టాలు ఇప్పించమని ఒకటి, రిటైర్డు ఉద్యోగుల భవనం నిమిత్తం ఒకటి, జీవనాధారం కల్పించమని ఒకటి, భూ సర్వే నిమిత్తం ఒకటి, శ్రీరామ్ చిట్స్ లో ఫండ్స్ రికవరీ నిమిత్తం ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం ఏవో నాంచారయ్య పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us