సారా, బెల్ట్ షాపులు నిర్మూలనకు కృషి చేయాలి

UPDATED 30th DECEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సారా, బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ నార్త్    ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ జి.వి. లక్ష్మి అన్నారు. స్థానిక ఐదవ వార్డు కుమ్మరి వీధిలో సారా, బెల్ట్ షాపుల నిర్మూలనపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊబా జాన్ మోజస్, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ లక్ష్మి మాట్లాడుతూ ఎక్కడైనా సారా తయారు చేస్తున్నా, అమ్ముతున్నా, అలాగే  బెల్టుషాపులు నిర్వహిస్తున్నా తమకు తక్షణమే సమాచారం అందించాలని అన్నారు. వార్డు వాలంటీర్లు, గ్రామ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది సారా నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్వకేట్ టి. సుధీర్ కుమార్, ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ జి.వి. నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us