ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికే నాడు-నేడు

UPDATED 27th DECEMBER 2019 FRIDAY 9:00 PM 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల విద్యా శాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి అన్నారు. స్థానిక సీబీఎం ఉన్నత పాఠశాలలో  నాడు-నేడు కార్యక్రమంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు, సచివాలయ సిబ్బందికి శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో  విజయలక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పాఠశాలలను పూర్తిస్థాయిలో మార్చి ప్రతీ పాఠశాలలో తొమ్మిది రకాల సదుపాయాలతో ఉండేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. తొలి విడతగా మండలం నుంచి 29 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పాఠశాలలో నీటి సౌకర్యం, మరుగుదొడ్డి, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరి గోడ ఏర్పాటు, పాఠశాల గోడలకు పెయింటింగ్ లు, ఆకుపచ్చ బోర్డు, ఫర్నిచర్ వంటి తొమ్మిది రకాల కనీస సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ప్రతీ పాఠశాలలో శనివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి సభ్యులతో నాడు-నేడు కార్యక్రమానికి బ్యాంక్ అకౌంట్లు తెరవాలని ఆదేశించారు. అలాగే  శని, ఆదివారాల్లో అమ్మ ఒడి పథకం కింద తుది జాబితా విడుదల అవుతాయని, వాటిని పరిశీలించి అందరికీ అందేలా చూడాలన్నారు. నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీలు పి. జాన్, సత్యవతి, ప్రసాదరావు, తోటకూర సాయిరామకృష్ణ, వెంకటరెడ్డి, సిఆర్పిలు, ఎస్ఎస్ఏ ఇంజనీర్ మూర్తి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us