Updated 1 February 2022 Tuesday 01:30 PM
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్): 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్‌లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రకటన రాలేదు. 5జీ సేవలు, ఈ-పాస్‌పోర్ట్, క్రిఫ్టో కరెన్సీపై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్స్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్థుల కోసం వన్ క్లాస్.. వన్ ఛానల్ మొదలైనవి ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలుగా నిలిచాయి. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అనే విషయాలను ఒకసారి పరిలీస్తే..
ధరలు పెరిగేవి..
● గొడుగులు (దిగుమతి చేసుకునే వాటిపై సుంకం 20 శాతం మేర పెరగనుంది)
● అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు. ఉదా: ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు తగ్గేవి..
● వస్త్రాలు
● నగలు
● మొబైల్ ఫోన్స్
● మొబైల్ ఛార్జర్
● చెప్పులు
● స్టీల్ స్క్రాప్స్







