భీమేశ్వరస్వామి ఆలయంలో అడిషనల్ ఎస్పీ ప్రత్యేక పూజలు

UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM 

సామర్లకోట: సామర్లకోటలోని వేంచేసిఉన్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రం చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి దేవాలయంలో అడిషనల్ ఎస్పీ ఎస్.వి. శ్రీధరరావు కుటుంబసమేతంగా విచ్చేసి స్వామి అమ్మవార్లను శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు తొలుత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదస్వస్తి పలికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్, అడిషనల్ ఎస్సై లక్ష్మి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us