మరిడమ్మ జాతర మహోత్సవాలకు పందిరి రాట

UPDATED 16th JUNE 2019 SUNDAY 8:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జులై నెల రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం పందిరి రాట వేశారు. వేద పండితుల పవిత్ర మంత్రోచ్ఛరణల నడుమ దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి పందిరి రాటకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ కమీషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వచ్చే నెల రెండవ తేదీ నుంచి ఆగష్టు నెల ఏడవ తేదీ వరకు మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టెం హరిగోపాలశర్మ, రాయి విజయకుమార్, ప్రసాద్ శర్మ, వెంకటశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us