ప్రగతిలో ముగిసిన అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం

UPDATED 31st AUGUST 2019 SATURDAY 9:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ, ఇ&ఐ సిటి అకాడమీ, ఎన్ఐటి (వరంగల్) సంయుక్త ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ఇన్ స్మార్ట్ గ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ రినివబుల్ ఎనర్జీ అనే అంశంపై ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన అధ్యాపక అభివృద్ధి శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసినట్లు ప్రగతి ఇంజనీరింగ్  కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు వివిధ కళాశాలల నుంచి హాజరైన అధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని, అలాగే ఈ ఆరు రోజుల కార్యక్రమంలో ఎన్ఐటి (వరంగల్), ఐఐటి (హైదరాబాద్), ఇంటెల్ కార్పోరేషన్ సంస్థల నుంచి ప్రసంగించేందుకు అతిథులుగా హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎం. వి. హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డైరెక్టర్ అకడమిక్ డాక్టర్ జి. రఘురాం, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, కార్యక్రమ సమన్వయకర్త, ట్రిపుల్ ఈ విభాగాధిపతి డాక్టర్ కె. సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us