UPDATED 25th JUNE 2018 MONDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 26వ తేదీన లెర్స్ టు ఇన్నోవేట్ పేరిట ఇన్నోవి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వర్క్ షాప్ ప్రారంభిస్తున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉదయం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆదిత్య ప్రాంగణంలో మూడురోజులపాటు నిర్వహించు ఈ వర్క్ షాప్ తదనంతరం రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో కూడా నిర్వహిస్తున్నట్లు అన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర యువజన శాఖ నిర్వహణలో ఈ మూడురోజుల వర్క్ షాప్ జరుగుతుందన్నారు.







