UPDATED 20th DECEMBER 2018 THURSDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22 తేదీలలో క్రైమ్ సీన్ మేనేజ్ మెంట్ - కనెక్టింగ్ క్రైమ్ టు ది కల్ప్రిట్, ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యత అనే అంశంపై రెండురోజుల రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్య ఫోరెన్సిక్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్-క్రైమ్ సీన్ రీకనస్ట్రక్షన్ అనే అంశంపై ఎపి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.ఎన్. మూర్తి, క్రైమ్ సేన్ మేనేజ్ మెంట్ అనే అంశంపై హైదరాబాద్ క్లూస్ టీమ్ శాఖాధిపతి డాక్టర్ వెంకన్న, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎవిడెన్స్ అనే అంశంపై ఆదిత్య ఫోరెన్సిక్ ప్రిన్సిపాల్ మోహన్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ కేస్ స్టడీ అనే అంశంపై ఔరంగాబాద్ ప్రభుత్వ ఫోరెన్సిక్ సైన్స్ ఇనిస్టిట్యూట్ శాఖాధిపతి డాక్టర్ రాజేష్ కుమార్ పాల్గొంటారని మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, అలాగే ఫోరెన్సిక్ విద్యార్థులతో పాటు వివిధ స్థాయి పోలీస్ అధికారులు పాల్గొంటారని తెలిపారు.







