Fire Accident: సినిమా హాలులో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ షో సినిమా హాలు‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కల కమ్ము కోవడంతో జనం భీతావహులయ్యారు. ఐదు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి కారణం కానీ, ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంత జరిగి ఉండచ్చనే వివరాలు వెంటనే తెలియలేదు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us