UPDATED 15th SEPTEMBER 2018 SATURDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి టెక్ ఫెస్ట్ పోలీ వేద-2కె18 విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలకు చెందిన సుమారు 1500మంది పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు హాజరై ఎంతో సృజనాత్మకతతో సమర్పించిన విద్యార్థులు పేపర్, పోస్టర్, ప్రాజెక్ట్, ప్రజెంటేషన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏమాత్రం తగ్గకుండా వారి స్థాయికి సరితూగేలా ఉన్నాయని ప్రిన్సిపాల్ కుమార్ అన్నారు. రెండురోజుల పాటు జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ఎపిటి -కాకినాడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి వై. ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలుగా నిర్ణయించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మాధవరావు, వివిధ శాఖాధిపతులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.







