UPDATED 19th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: కార్తీక మాసం రెండవ సోమవారం, ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమశ్వరస్వామి ఆలయంలో ఏపీయుడబ్ల్యుజె తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె. స్వాతి ప్రసాద్ దంపతులు లక్ష బిల్వార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు, లక్ష కుంకుమార్చన పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యుజె సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







