భక్తిశ్రద్ధలతో గోపూజా మహోత్సవం

UPDATED 11th JANUARY 2019 FRIDAY 6:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణు గోపాలస్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తూర్పుగోదావరి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గోపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు.  వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ధర్మకర్త మలకల సూర్యారావు అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మలకల సూర్యారావు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తూర్పుగోదావరి శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజలో పాల్గొవడం ఎంతో ఆనందంగా ఉందని, పురాణకాలం నుంచి హిందూ ధర్మం ప్రకారం గోవుకు విశిష్ట స్థానం కల్పించి పూజించడం మన సాంప్రదాయమని అన్నారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయని, గోమయం, గోమూత్రం, ఆవు పాలు ఇలా గోవు నుంచి లభించే ప్రతీ వస్తువు ఎంతో పవిత్రమైనవిగా మనం భావిస్తామని, ఇటువంటి కార్యక్రమంలో పాల్గోవడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. పూజానంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us