TTD: తిరుమలలో అద్దె గదుల కోసం భక్తుల అవస్థలు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనతో తిరుమలలో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సర్వీసెస్‌ కింద పనిచేసే తమను తితిదే కార్పొరేషన్‌లో కలపాలంటూ గత వారం రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తూ విధులను బహిష్కరించారు. దీంతో తిరుమలలో పారిశుద్ధ్య పనులకు ఇబ్బందులు తలెత్తాయి. గుత్తేదారు సంస్థ అరకొరగా కార్మికులతో గదులను శుభ్రం చేయిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం కష్టమవుతోంది. దీంతో అద్దె గదుల కోసం భక్తులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా ఇప్పటికీ ఇప్పటికీ గదులు కేటాయించడం లేదని.. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us