హైస్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించిన గైట్ ఎన్ఎస్ఎస్

UPDATED 21st MARCH 2018 WEDNESDAY 10:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం మండలంలోని కొత్త తుంగపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక  శిబిరం బుధవారంతో ముగిసినట్లు కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు మండల పరిషత్ అధ్యక్షుడు బచ్చు శ్యామలా ప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంగిశెట్టి చంటిబాబు, పాఠశాల ఇంచార్జ్ హెడ్ మాస్టర్ బి. శైలజ, తదితరులు బహుమతులు ప్రధానం చేశారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us