ఆదిత్యలో గ్రంథాలయ వారోత్సవాలు

UPDATED 13th NOVEMBER 2017 MONDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. "మై లైబ్రరీ- మై ఐడియల్ లైబ్రరీ" అనే అంశంపై విద్యార్థుల, అధ్యాపకుల అభిప్రాయాలను కోరుతూ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గ్రంథాలయంపై ఆడియో, వీడియోలతో కార్యక్రమం, వకృత్వ పోటీలు, గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న వారి గురించి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల కోసం వారి జీవిత విశేషాలు మొదలైన అంశాలను తెలియచేయడం జరుగుతుందన్నారు. 20 వ తేదీ ముగింపు వేడుకలలో విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిరెడ్డి రమేష్, గ్రంథాలయాధికారి కె. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us