రైతుల్లో మనోధైర్యం నింపండి : కలెక్టర్ హరికిరణ్

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021‌: రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యం కొంటామని రైతుకు ధైర్యాన్నివ్వాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్‌కలెక్టర్లు, ఆర్డీవో, ఐటీడీఏ పీవోలు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీక్షణలో సమీక్షించారు.మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్స్‌కు స్థలాలు సేకరించాలన్నారు. సీఎం సమీక్ష: సీఎం జగన్‌ వీక్షణ సమీక్షకు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జేసీలు సుమిత్‌కుమార్‌, కీర్తి, భార్గవ్‌తేజ, డీఆర్వో సత్తిబాబు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ రవీంద్రబాబు హాజరయ్యారు. కొవిడ్‌, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, 90 రోజుల్లో ఇంటి పట్టా, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన, ధాన్యం కొనుగోళ్లు, శాశ్వత భవన నిర్మాణాలపై సమీక్షించారు. సీపీవో త్రినాథ్‌, హౌసింగ్‌ పీడీ సుదర్శన్‌ పట్నాయక్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం లక్ష్మిరెడ్డి, డీఎస్‌వో ప్రసాదరావు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us