UPDATED 9th MAY 2018 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డి. శ్రీలక్ష్మి ఎన్ఐటిటిఇ యూనివర్సిటీ, మంగుళూరు నుంచి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీలక్ష్మి డాక్టరేట్ పొందడం ఆనందంగా ఉందని, సహ అధ్యాపకులకు ఆమె ఆదర్శప్రాయమని ఆయన తన అభినందనలు తెలియచేశారు. డా. శ్రీలక్ష్మి మాట్లాడుతూ తాను సమర్పించిన "వాలిడేషన్ అఫ్ అనలిటికల్ మెథడ్స్ ఆఫ్ సమ్ డ్రగ్స్ ఇన్ బల్క్ అండ్ డోసేజ్ ఫర్మ్" థీసిస్ కు డాక్టరేట్ పొందడం ఆనందంగా ఉందని, తనలాంటి వారెందరికో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదర్శమని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య కాలేజ్ అఫ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. రవిశంకర్, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.







