కరోనా నివారణకు హోమియో మందులు పంపిణీ

UPDATED 7th MARCH 2020 SATURDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లా ఆయుష్ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని చంద్రమాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా వైరస్ నివారణకు ఉచిత  హోమియో మందులు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోమియో వైద్యులు డాక్టర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ కరోనా, అలాగే ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నప్పుడు చేతురుమాలు అడ్డుపెట్టుకుని తుమ్మడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇతరులకు ఈ వైరస్ ప్రబలకుండా ఉంటుందని అన్నారు. అనంతరం 629 మంది విద్యార్థినీ, విద్యార్థులకు హోమియో మందు పంపిణీ చేశారు. ఈ మందు మూడు రోజులపాటు వేసుకోవాలని ఆయన సూచించారు. రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ బర్రే నాగేశ్వరావు మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా తమ సంస్థ ద్వారా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగంపై రైతులకు అనేక అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె. గాయత్రి, ఉపాధ్యాయులు ఆర్. నాగజ్యోతి, ఎన్. జగన్నాధం, ఎం.ఎస్.ఎన్. మూర్తి, రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది బచ్చల శ్రీనివాస్, ఏ. నరేష్, తదితరులు పాల్గొన్నారు.                    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us