సిద్ధివినాయక, శ్రీకృష్ణ ఆలయాలు ప్రారంభం

UPDATED 5th SEPTEMBER 2018 WEDNESDAY 6:30 PM

సామర్లకోట: స్థానిక కొత్తూరు వీధిలో శ్రీసిద్ధివినాయక, శ్రీకృష్ణ ఆలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ వైణి రామకృష్ణ  మాట్లాడుతూ వినాయక చవితి దగ్గర పడటంతో ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చుండ్రు రాజారావు, కురుకూరి గోపి, పుట్టా వీర్రాజు, చుండ్రు భద్రరావు, ఉండవల్లి ప్రభాకరరావు, చలికి శ్రీనివాస్, బిక్కిన వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us