విజవంతంగా ముగిసిన ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

UPDATED 11th JANUARY 2019 FRIDAY 7:15 PM

గండేపల్లి: ఆరవ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గత పదిరోజులుగా జరుగుతున్న ప్రత్యేక శిబిరం పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రోజుకో కార్యక్రమంలో భాగంగా సర్వే, స్వచ్ఛభారత్, బాల్య వివాహాలపై అవగాహనా ర్యాలీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటం, పశువైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, గ్రామ సర్పంచ్, పాఠశాల హెచ్ఎం, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us