కాంక్రీట్ లో నూతన పరిణామాలపై గైట్ లో సెమినార్

UPDATED 7th JULY 2018 SATURDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కాంక్రీట్ లో నూతన పరిణామాలు అనే అంశంపై శనివారం ఒకరోజు సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ డి. రామశేషు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్మాణరంగంలో ఎన్నో ఆధునిక విధానాలు రానున్నాయని, నేటి యువ ఇంజినీర్లు నిర్మాణ రంగంలో నిష్ణాతులు కావాలంటే నూతన పద్దతులపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రస్తుతం కాంక్రీటుకు సిమెంట్, ఇసుక, మెటల్, నీరు వినియోగిస్తున్నారని, అయితే పర్యావరణహితమైన కాంక్రీటుకు ప్రత్యామ్నాయంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా పలు విషయాలను ఆయన వివరించారు. అనంతరం కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్, కళాశాల సివిల్ విభాగాధిపతి డాక్టర్ డి. వెంకటేశ్వర్లు రామశేషును దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బిటెక్, ఎంటెక్ విద్యార్థులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us