* మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు
UPDATED 24th JANUARY 2020 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్పు చేసిన నూతన మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్నభోజనం విద్యార్థులకు అందించాలని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న తీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూను అన్ని పాఠశాలల్లో తప్పక పాటించాలని అన్నారు. మెనూ ప్రకారం అన్నం, పప్పు ఆకుకూర, ఉడికించిన గుడ్డు అందిస్తున్నారో లేదో స్వయంగా పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులతో స్టడీ అవర్స్ గురించి తెలుసుకుని, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు. సత్యనారాయణ, ఉన్నత పాఠశాలల పర్యవేక్షకులు వి. రాజు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







