UPDATED 20th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలో స్థానిక అమ్మణమ్మ అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం మహిళా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సి.హెచ్. రమణి హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలపై నిరంతరం దాడులు పెరిగి పోతున్నాయని, చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. ఇటీవల కాలంలో మతి స్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా పోరాడిన మహిళలకు ఆమె అభినందనలు తెలిపారు. అలాగే అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు కె .వరలక్ష్మి, లక్ష్మి, మంగమ్మ, దుర్గ, వరలక్ష్మి, దేవి, సుబ్బలక్ష్మి, వాణి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.







