UPDATED 5th JULY 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు మరువలేనివని మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య అన్నారు. సామర్లకోట మండలం పరిధిలోని సత్యవరం మండల ప్రాథమిక పాఠశాలలకు హ్యాపీ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సుమారు రూ. రెండు లక్షలతో హ్యాండ్ వాష్ రన్నింగ్ వాటర్ డ్రైనేజీ, తరగతి గదులకు కటకటాలు, ఫ్లోరింగ్, పది బెంచీలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు నాగేశ్వరరావు, కాశీ విశ్వేశ్వరరావు, పవన్, పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అప్పలకొండ, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







