UPDATED 2nd APRIL 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ, దేశవ్యాప్త బంద్ లో భాగంగా మాలమహానాడు ఆధ్వర్యంలో స్థానిక స్టేషన్ సెంటర్ లో సోమవారం ధర్నా నిర్వహించారు. దేశంలో దళితులపై దాడులను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాలమహానాడు జిల్లా అధ్యక్షులు లింగం ప్రసాద్, సిపిఐ (ఎంఎల్) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లా చంద్రరావు(చంద్రం), జిల్లా కార్యదర్శి నీలం నాగేంద్రప్రసాద్, దడాల సతీష్, కోన శ్రీనివాసరావు, లింగం గంగాధర్, ముక్కు నాని, కండవల్లి సుబ్బారావు, నేతల హరిబాబు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







