లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

UPDATED 5th JULY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: భీమేశ్వర లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శుక్రవారం జరిగింది. లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడుగా మేకా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడుగా అమలకంటి శ్రీనివాస్, కార్యదర్శిగా ప్రత్తి రామలక్ష్మణమూర్తి, కోశాధికారిగా కర్రి ఆదినారాయణరెడ్డి, జాయింట్ సెక్రెటరీగా సేపేని సురేష్ ఎన్నికయ్యారు. అనంతరం క్లబ్ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఉన్నతమైన స్థితికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల శివనాగ ప్రసాద్, మద్దిరాల శివనాగకృష్ణ, ఈదర ఈశ్వరకుమార్, గుండు శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us