హత్యాయత్నం వెనుక ప్రభుత్వ కుట్ర

* వైఎస్‌ జగన్‌ను అంతమొందించడమే లక్ష్యం
* కేసును నీరుగార్చేందుకు సీఎం, డీజీపీ కుట్ర
* సీఎంకు ధైర్యముంటే కేసు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలి
* వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

UPDATED 30th OCTOBER 2018 TUESDAY 7:00 PM

పెద్దాపురం: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు    ఆరోపించారు. స్థానిక వల్లభ ఎస్టేట్స్ లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలనలో పూర్తిగా విఫలమైన సిఎం చంద్రబాబు రానున్న ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ కల్గిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేకనే ఆయన్ను తుద ముట్టించేందుకు పన్నాగం పన్నారని, ఇది రాష్ట్రంలోని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోందాని, వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని టిడిపి మినహా అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయని, సిఎం మాత్రం కేసును నీరు గార్చేందుకు పాట్లు పడుతున్నారన్నారు. ఘటన జరిగిన గంటన్నరలోపే డీజీపీ విశాఖలో లేకపోయినా నిందితుడి కులం, ఇతర కీలక వివరాలు ఎలా సేకరించారని, సరైన ఆధారాలు లేకపోయినా నిందితుడు జగన్‌ అభిమాని అని ఆయన ఎలా చెప్పగలిగారని, దీన్నిబట్టి చూస్తుంటే కేవలం అసత్యాన్ని ప్రచారం చేసేందుకే డీజీపీ మాట్లాడారని స్పష్టమవుతోందని అన్నారు. ప్రజలకి, ప్రతిపక్షాలకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే అది ఒట్టి డ్రామా అని సీఎం కొట్టి పారేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసు సరైన మార్గంలో విచారణ సాగడం లేదు కనుకనే తమ పార్టీ  ఎంపీలు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రపూరితంగా తమ పార్టీ  అధ్యక్షుడిపై దాడి చేశారని ఆరోపించారు. జగన్‌పై దాడి ఘటనలో ముఖ్యమంత్రి, డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. మాటల దాడి చేస్తూనే రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా అందించడమే వైఎస్‌ జగన్‌ లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరావు, గోలి వెంకట అప్పారావు చౌదరి, దవులూరి సుబ్బారావు, ఊబా జాన్ మోజెస్, తదితరులు పాల్గొన్నారు.     

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us