* జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి
* జై భారత్ నేషనల్ పార్టీలో భారీ చేరికలు
* నియోజకవర్గంలో లభిస్తున్న అనూహ్య స్పందన
UPDATED 28th MARCH 2019 THURSDAY 6:30 PM
పెద్దాపురం: ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన పెద్దాపురం పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా పెద్దాపురం పట్టణ పరిధిలో గల కొత్తపేటకు చెందిన సుమారు 100 మంది జై భారత్ నేషనల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిన్నయ్యదొర కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జై భారత్ నేషనల్ పార్టీ సిద్దాంతాలు నచ్చి ప్రజలు తమ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా కె. అబ్బాస్, కె. బాబ్జి, వై. నాగబాబు, పి.సత్యశ్రీతోపాటు మరో 100 మంది పార్టీలోకి చేరారు. పెద్దాపురం నియోజకవర్గంలో తమ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయం అన్నారు. తమ పార్టీ గుర్తు గాజులుపై వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.వి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







