వాటర్ షెడ్ ద్వారా ఆర్థిక అభివృద్ధి : అడిషనల్ కమీషనర్ డాక్టర్ సీపీ రెడ్డి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 7  నవంబర్ 2021:  వాటర్ షెడ్ పథకం ద్వారా పలు రకాలుగా వ్యవసాయం చేసుకొంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని 
డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సీనియర్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ సీపీ రెడ్డి పేర్కొన్నారు. రంపచోడవరం మండలం బోలగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ షెడ్ పథకం ద్వారా నిర్మించిన చెరువులు, చెక్ డ్యాములు, రాతి కట్టడాలు, గ్యాబియన్ కట్టడాలను ఆయన రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, డిప్యూటీ కమిషనర్ శశిదర్ రెడ్డి, స్టేట్ టెక్నికల్ వాటర్ షెడ్ అడ్వైజర్ శంకర్ నాయక్ తో కలిసి ఆదివారం  పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ ఏజెన్సీలో చేపట్టిన వాటర్ షెడ్  పనులను వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని, తక్షణమే అమలు చేయాలన్నారు.  బోలగొండ గ్రామంలో కడబాల ప్రకాష్, కడబాల రామారావు, సిహెచ్ చిలక రెడ్డి, చోళ్ల సన్యాసి రెడ్డి రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ పథకాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నది రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా చెరువుల్లో చేప పిల్లలు వేసిన తర్వాత గ్రామ సభ తీర్మానంతో చేప పిల్లల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా గ్రామాలకు ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామసభ తీర్మానం చేసుకోవాలని సూచించారు. ఈ చెరువులో పూడిక తీత పనులు ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పనులు చేపట్టాలని, సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ చెరువుల గట్లల్లో వివిధ రకాల మొక్కలను ఉపాధి హామీ పథకం ద్వారా నాటాలన్నారు. అలాగే చెక్ డ్యామ్ ల ద్వారా వ్యవసాయానికి నీరు ఉపయోగించుకొని రెండు పంటలు వేసుకోవాలని గిరిజన రైతులకు సూచనచేశారు. ఎత్తుపల్లాల భూముల్లో జీడి మామిడి ఎన్ని మొక్కలు వేసింది ఒక సంవత్సరానికి ఎన్ని క్వింటాల్  వస్తున్నది, ఎన్ని కేజీలు దిగుబడి వస్తోందో, ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తున్నదీ తదితర వివరాలు కమిషనర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో కొంతమంది రబ్బరు తోటల వేసుకోవడం జరిగిందని తమకు ప్రాసెసింగ్ కు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా రబ్బరు సాగు రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీలోని గిరిజనులకు జీవన పరిమాణాలు  అభివృద్ధి చేయుటకు, జీవన ఉపాధి కల్పించుటకు ఎంతమందికి ఎడ్లు, మేకలు, తదితర యూనిట్లు  అందజేసింది. వెలుగు ఏ.పీ.ఎం. అపర్ణ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వాటర్ షెడ్ పథకం, రాతి కట్టడాలు, చెక్ డ్యాములు, చెరువులు, గ్యాబి యన్ కట్టడాలు అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో పీ.హెచ్.ఓ.వై. సత్యనారాయణ, వాటర్ షెడ్ ప్రోగ్రాం అధికారులు సంధ్యారాణి, స్టాలిన్ బాబు, గంగరాజు, రామిరెడ్డి, సర్పంచ్ పల్లాల సీతమ్మ, కడబాల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us