UPDATED 26th OCTOBER 2020 MONDAY 9:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా సెట్రాజ్ సీఈవోగా మోకా భాను ప్రకాష్ సోమవారం స్థానిక రమణయ్య పేటలో గల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని డ్వామా కార్యాలయ ఏవోగా పనిచేస్తూ పదోన్నతిపై సెట్రాజ్ సీఈవోగా నియమితులయ్యారు. యువతలో నైపుణ్యం పెంపొందించి శిక్షణ మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.







