UPDATED 25th FEBRUARY 2020 TUESDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లా పశుసంవర్ధక శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మండల పరిధిలోని తిరుపతి, తాటిపర్తి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, గుడివాడ, గోరింట, వడ్లమూరు గ్రామాల్లో సంచార విజ్ఞాన వాహనం ద్వారా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి దివిలి పశు వైద్యాధికారి డాక్టర్ నయీమ్ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు పశువులకు సంక్రమించే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరం, నోరు, ముక్కు నుంచి చొంగ కారడం, కాలి గిట్టల మధ్య పుళ్ళు ఏర్పడి చూడి పశువులు ఈసుకుపోతాయని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ బర్రే నాగేశ్వరావు మాట్లాడుతూ రైతుల కోసం తమ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ కృష్ణ, అఖిల్, రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది బచ్చల శ్రీనివాస్, అనుకుల నరేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.







