సమాచారం నమోదులో నిర్లక్ష్యం తగదు

UPDATED 22nd JANUARY 2020 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని యూడైస్ లో నమోదు చేయడంలో ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి హెచ్చరించారు. మండల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్థానిక దుర్గా ప్రసాద్ పబ్లిక్ స్కూల్లో బుధవారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఈవో విజయలక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతీ పాఠశాల, విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రతీ పాఠశాలలో విద్యార్థులు తరగతుల వారీగా తమ సామర్థ్యాలు సాధించే విధంగా చూడాలని, ప్రతీ నెలా చిట్టి చేతులు, చక్కని రాతలు నిర్వహించాలని, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా డైరీ లెసన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు వినియోగించినట్లు తన దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో నూతన మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే మధ్యాహ్న భోజన కార్మికులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం యుడైస్ ఆన్ లైన్ లో నమోదు విధానంపై ఎం.ఆర్.సీ కంప్యూటర్ ఆపరేటర్ సుబ్రమణ్యం వివరించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us