UPDATED 25th JULY 2017 TUESDAY 9:00 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవలే జియో 4జీ ఫీచర్ ఫోన్ గురించిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రూ.1500 డిపాజిట్‌తో లభించనున్న ఈ ఫోన్ ఆగస్టు 24 నుంచి వినియోగదారులకు లభ్యం కానుండడంతో ఈ ఫోన్ పట్ల చాలా మంది యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే... ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో కేవలం ఒకే ఒక్క సిమ్ వేసుకునేందుకే ఛాన్స్ ఉంటుందట. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో రావడం లేదని తెలిసింది. అది కూడా వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉన్న సిమ్ మాత్రమే ఈ ఫోన్‌లో పని చేస్తుంది. అంటే.. ప్రస్తుతం వీవోఎల్‌టీఈని అందిస్తున్నది దేశంలో జియో మాత్రమే కనుక, కేవలం ఆ సంస్థకు చెందిన సిమ్‌లు మాత్రమే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో పనిచేస్తాయన్నమాట. ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన సిమ్‌లను వేసుకోలేం. అయితే భవిష్యత్తులో ఈ ఫోన్‌కు చెందిన డ్యుయల్ సిమ్ వేరియెంట్‌ను తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు జియో ప్రతినిధులు పేర్కొంటున్నారు.







