UPDATED13th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 30వ వార్డులో గల 63,64 రేషన్ షాపులను సివిల్ సప్లై అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపులో గల రికార్డులను పరిశీలించి, అనంతరం లబ్ధిదారులను వివరాలు అడిగి తీసుకున్నారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పి. ప్రసాదరావు, సురేష్, రెవిన్యూ సిబ్బంది భరత్, ఖాదర్ వల్లీ, తదితరులు పాల్గొన్నారు.







