ఆదిత్యలో సిఎం ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం

UPDATED 5th OCTOBER 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ కార్పోరేషన్, డస్సాల్ట్ సిస్టమ్స్ సహకారంతో 3-డి ఎక్స్ పీరియన్స్ సెంటరును ఎ.పి.ఎస్.ఎస్.డి.సి టెక్నికల్ జనరల్ మేనేజర్ డాక్టర్ రవి గుజ్జుల ప్రారంభించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ దీనికి సంబంధించి ఆదిత్య విద్యాసంస్థలు, 3-డి ఎక్స్ పీరియన్స్ సెంటరు ఎ.పి.ఎస్.ఎస్.డి.సితో అవగాహనా ఒప్పందం కుదిరిందని, తద్వారా అత్యాధునిక అత్యంత వేగవంతంగా పనిచేసే ఒక్కొక్కటి సుమారు రూ.2లక్షల విలువ గల 36 హై-ఎండ్ లాప్ టాప్ లను సెంటరుకు ఇచ్చారని, ఆదిత్య 36 లేటెస్ట్ కంప్యూటర్లను సమకూర్చి విద్యార్థులు తమ నైపుణ్యం పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు అనువుగా సిద్ధంగా ఉంచడం జరిగిందని అన్నారు. ఎ.పి.ఎస్.ఎస్.డి.సి టెక్నికల్ జనరల్ మేనేజర్ డాక్టర్ రవి గుజ్జుల మాట్లాడుతూ విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా శిక్షణ పొంది నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రతిష్టాకరమైన మల్టీ నేషనల్ కంపెనీల మౌఖిక పరీక్షల్లో అత్యంత సులువుగా ఎదుర్కొనే విధంగా సిద్ధం కావడానికి ఉపయోగపడతాయని తెలిపారు. అత్యంత విలువైన ఈ సిఎం ఎక్సలెన్స్ సెంటర్ ఆదిత్యకు రావడం ఆదిత్య సంస్థ విద్యార్థుల అదృష్టమని అన్నారు. ఈ సెంటరును విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఏ. శరవణన్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us