UPDATED 11th JUNE 2018 MONDAY 8:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల బిటెక్ రెండవ సంవత్సరం విద్యార్థులకు సి ప్రోగ్రామింగ్ పై నిర్వహించిన వేసవి శిక్షణా కార్యక్రమం ముగిసినట్లు కళాశాల అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎస్ఇ, ఈసిఈ విభాగాలకు చెందిన 80 మంది విద్యార్థులకు వారం రోజులు పాటు ఈ శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. గైట్ కళాశాల సిఎస్ఇ విభాగం సీనియర్ ఫాకల్టీ డి. సత్తిబాబు, అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. చక్రవర్తి, రిసోర్స్ పర్సన్స్ గా, సిఎస్ఇ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ డి. మధు సమన్వయకర్తగా ఈ శిక్షణా కార్యక్రమం జరిగిందన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి, కంప్యూటర్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ టి.వి.ప్రసాద్, సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ బి.సుధీర్, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి సర్టిఫికెట్లు అందచేశారు.







