హాస్టల్ వార్డెన్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు

UPDATED 2nd AUGUST 2017 WEDNESDAY 9:00 PM

అంబాజీపేట : హాస్టల్ వార్డెన్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్‌ ఎ.మల్లికార్జున హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రులోని సంక్షేమ వసతి గృహాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. జిల్లాలోని 8  సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సాంఘిక సంక్షేమ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ద్వారపూడి, పిఠాపురం, ఆలమూరు, హసనబాద, అంబాజీపేట, ధవళేశ్వరం, రాజోలు, రౌతులపూడిలలోని వసతి గృహాల నిర్వహణతోపాటు వార్డెన్ల పనితీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించామని, వసతి గృహాల వార్డెన్ల పనితీరుపై వచ్చిన ఆరోపణలపై ఆయా శాఖల అధికారులతోపాటు ఆర్డీవోలతో విచారణ జరిపించి నివేదిక కలెక్టరుకు అందిస్తామని ఆయన చెప్పారు. వారంలో ఒక రోజు వసతి గృహాల తీరును సంబంధింత అధికారులు పరిశీలించాలని అన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం.ఎస్‌.శోభారాణి, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్‌, ఎల్‌.రఘుబాబు, వి.విశ్వేశ్వరరావు, ఆశ్రమ పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఎన్‌.రమామహేశ్వరి, ఎంపీపీ దాసరి వీర వెంకట సత్యనారాయణ, ఎంపీడీవో టి.ఎస్‌.విశ్వనాథ్‌, తహసీల్దారు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us